Home తాజా వార్తలు JNI Today / వాట్ యన్ ఐడియా కలెక్టర్ సాబ్.. “కిలో ప్లాస్టిక్ కు కిలో...

JNI Today / వాట్ యన్ ఐడియా కలెక్టర్ సాబ్.. “కిలో ప్లాస్టిక్ కు కిలో బియ్యం”

0
6

JNI Today mulugu district: ఆయనొక కలెక్టర్.. ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యం. మొన్న దీపావళికీ నో క్రాకర్స్ అన్నారు. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొన్న దీపావళి టపాసులు నిషేధం.. నేడు ప్లాస్టిక్ పై యుద్ధం.. ములుగు జిల్లా వెలుగే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు కలెక్టర్ నారాయణరెడ్డి. దీపావళికి టపాసులు కాల్చకుండా.. గ్రీన్ దివాళీ జరుపుకొందామని అవగాహన ఇచ్చిన ఆయన ఈ సారి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కిలో ప్లాస్టిక్ కు కిలో బియ్యం స్కీమ్ ను తీసుకొచ్చారు. ప్లాస్టిక్ ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇక్కడ కూడా అదే జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీల్లో 171 గ్రామ పంచాయతీల్లో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వంద శాతం నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఉన్న ప్లాస్టిక్ వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కేజీ ప్లాస్టిక్ వేస్ట్ కు ఒక కేజీ మంచి బియ్యాన్ని ఇచ్చే విధంగా ప్రొగ్రాం చేపట్టామని అధికారులు వెల్లడించారు.

ములుగు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు కలెక్టర్. వాడి వదిలేసిన ప్లాస్టిక్ కవర్లు ,బాటిల్స్ వ్యర్థాలన్నింటినీ సేకరిస్తున్నారు. కిలో ప్లాస్టిక్ సేకరిస్తే కిలో సన్న బియ్యం అందిస్తున్నారు. ఇప్పుడు స్కీమ్ ఉద్యమంలా సాగుతోంది. ప్రజలంతా ప్లాస్టిక్ సేకరణలో భాగస్వాములయ్యారు. ప్రజలకు బియ్యం అందించేందుకు ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు.ఇక్కడ సేకరించిన ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయడానికి అప్పగించి అదే విధంగా రీసైకిల్ చేయలేని క్యారీ బ్యాగ్స్ లాంటి వాటిని సిమెంట్ ఫ్యాక్టరీ పంపించే విధంగా కూడా చర్యలు తీసుకుటున్నట్లు సమాచారం. వీటితో పాటుగా మహిళా సంఘాలకు పేపర్ తో బ్యాగ్ తయారు చేసే విధంగా ఒక యూనిట్ ను ప్రారంభించే విధంగా సంఘం నుంచి తీసుకుంటున్నాం.తర్వాత క్లాత్ ద్వారా కూడా మనకు క్లాత్ బ్యాగ్స్ ను కూడా వినియోగంలోకి తీసుకురావాలనుకుంటునట్లు తెలియజేశారు.

త్వరలో మేడారం మహా జాతర ప్రారంభమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాంటీ ప్లాస్టిక్ జాతర నిర్వహించాలని ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నారు కలెక్టర్. రాబోయే మేడారం కూడా అంటే సుమారు నెలకు కోటి ముప్పై లక్షల జనాభా ఒక వారం రోజుల్లో వస్తారు. అలాంటప్పుడు ఒక్క సింగిల్ పీస్ ప్లాస్టిక్ కూడా ఉండకుండా చూసుకునే విధంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతుందన్నారు. తప్పకుండా అందరి సహకారంతో ప్లాస్టిక్ ఫ్రీ ములుగుతో పాటు ప్లాస్టిక్ ఫ్రీ మేడారం కూడా సాధిద్దామని అధికారులు ఆశిస్తున్నారు.ఏ ప్రయత్నమైనా ఒక్కరితో మొదలవుతుంది.అది ఆచరణలో సరిగ్గా అమలైతే మహాయజ్ఞంలా సాగుతుందనడానికి, కిలో ప్లాస్టిక్ కు కిలో బియ్యం పథకం నిదర్శనం. ప్రజలంతా ప్లాస్టిక్ ఏరివేత పనిలో పడ్డారు. త్వరలో ములుగు ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుతుంద ని ఆశిస్తున్నారు.