Home తాజా వార్తలు JNI Today / నెల్లూరు లో ఘనంగా జాప్ 27వ వార్షికోత్సవ వేడుకలు

JNI Today / నెల్లూరు లో ఘనంగా జాప్ 27వ వార్షికోత్సవ వేడుకలు

0
16

JNI Today  నెల్లూరు జిల్లా: జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులో జాప్ 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాప్ రూపొందించిన 27వ వార్షికోత్సవ కేక్ ను ముఖ్యఆతిధులుగా విచ్చేసిన జాప్ రాష్ట్ర కోశాధికారి పాశం ఏడుకొండలు, ఏపీఈ జేయు జిల్లా అధ్యక్షులు ఉడతా రామకృష్ణ, ఎపిజేఎఫ్ జిల్లా కన్వీనర్ ఎస్. శ్రీనివాసులు, కో కన్వీనర్ మల్లు రాజేంద్రప్రసాద్ కట్ చేశారు. అనంతరం జాప్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్యర్యంలో

ముఖ్య అతిధులకు శాలువాలు కప్పి సత్కరించారు. 25 ఏళ్లుగా జాప్ యూనియన్ లో కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టు పాశం ఏడుకొండలును, చిన్న పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులకు చేదోడుగా నిలిచే “సదా మీ కోసం” పత్రిక ఎడిటర్ ఉడతా రామకృష్ణను, వివాదరహితుడైన అభయం పత్రిక ఎడిటర్ ఎస్.శ్రీనివాసులును జాప్ తరపున సత్కరించటం గర్వంగా ఉందని జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. జాప్ జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో వార్షికోత్సవం జరుపుకొంటున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాప్ నాయకులు రేబాల కోటేశ్వరరావు, ఆరి రోహిత్ కృష్ణ, కొలపర్తి హజరత్తయ్య, ఎస్కే న్యూస్ ఎడిటర్ షేక్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.