JNI Today నెల్లూరు: నెల్లూరు నగరం మిని బైపాస్ రోడ్డు లో ఉన్న సిఐటీయు ఆఫీసు సమీపంలో బారీ వృక్షం నేలకొరిగింది. ఉదయం కావడంతో ట్రాఫిక్జామ్ అయింది. ట్రాఫిక్ జామ్లో పాఠశాలలకు వెళ్లే పిల్లలకు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులకు అవస్తలు పడ్డారు.. ట్రాఫిక్ క్రమబద్దీకరించాల్సిన పోలీసులు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. చలానాలు వేయడానికేనా ట్రాఫిక్ పోలీసులు అని ఆరోపిస్తున్నారు. వృక్షాన్ని తొలగించాల్సిన కార్పొరేషన్ సిబ్బంది ఒక్కరు కూడా లేకపోవడం శోచనీయం ఇప్పటికైనా అధికారులు స్పందించి వృక్షాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.