Home ఆంధ్రప్రదేశ్ అమరావతి JNI Today / సిఎం జగన్‌ వ్యవసాయ మిషన్‌పై సమీక్ష

JNI Today / సిఎం జగన్‌ వ్యవసాయ మిషన్‌పై సమీక్ష

0
7

JNI Today అమరావతి: సిఎం జగన్‌ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌పై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి, మంత్రులు బాలినేని, మోపిదేవి, కన్నబాబు మరియు ఉన్నాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వెబ్‌సైట్‌ను ఈ సందర్భంగా సిఎం జగన్‌ ప్రారంభించారు. రైతు భరోసా పథకంపై, అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పించాలని అధికారులకు సిఎం జగన్‌ సూచించారు. వ్యవసాయ భూ రికార్డుల పరంగా ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇంకా చిరు ధాన్యాలు సాగుచేస్త్ను రైతులను కూడా ఆదుకోవాలని సిఎం జగన్‌ నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులు సాగుకు వెచ్చిస్తున్న ఖర్చును పరిగణలోకి తీసుకుని ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే ధరలు ప్రకటించాలని సిఎం సూచించినట్లు మంత్రి వివరించారు.