Home తాజా వార్తలు JNI Today / ‘ధరలు తగ్గుతున్నా..జే-ట్యాక్స్‌ పెంచుతున్నారు’ తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు

JNI Today / ‘ధరలు తగ్గుతున్నా..జే-ట్యాక్స్‌ పెంచుతున్నారు’ తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు

0
13

JNI Today తణుకు: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన మొత్తం స్తంభించిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తెదేపాకు పేరొస్తుందనే అక్కసుతో తమ హయాంలో కట్టిన ఇళ్లకు సైతం గృహప్రవేశం చేయడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల సమీక్షలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఆర్థిక మాంద్యంతో అన్ని వస్తువులపై ధరలు తగ్గుతున్నా.. జె-ట్యాక్స్‌ మాత్రం పెంచుతున్నారని ఎద్దేవా చేశారు. పీపీఏల విషయంలో మనపై బురద చల్లాలని చూశారని ఆయన విమర్శించారు. సీఎం జగన్‌ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నదుల అనుసంధానం చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారంటే అదీ తమపై ఉన్న విశ్వసనీయత అని చెప్పారు. వర్షాలు పడటం కూడా తమ చలవే అని వైకాపా నేతలు అంటున్నారని.. జలాశయాలు, కాల్వలు మాత్రం నింపలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు.