Home తాజా వార్తలు JNI Today / విద్యారంగ అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్

JNI Today / విద్యారంగ అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్

0
1

JNI Today ఢిల్లీ: కేంద్ర మంత్రి తహర్ చంద్ గెహ్లాట్‌ను రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు కలిశారు. అనంతరం మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడుతూ… అణగారిన వర్గాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. 238 సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలు సమర్థవంతంగా నడుస్తున్నాయి. సోషల్ వెల్ఫేర్‌లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 66 మినీ గురుకులాల కోసం రూ.303 కోట్లు మంజూరు చేయాలని కోరినం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.356 కోట్లు, బీజేఆర్సీవై ప్రతిపాదించిన 7 హాస్టళ్ల కొరకు రూ.21 కోట్లు, ప్రత్యేక కేంద్ర సహాయం కింద రూ.201 కోట్లు సహాయం అందించాలని కోరినం. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా యువత శిక్షణ కోసం వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. వాటికి కేంద్రం రూ.50 కోట్లు సహాయం అందించాలని కోరాం. ఏడీఐపీ పథకం కింద దివ్యాంగులకు వీల్ చైర్లు అందించేందుకు రూ.22 కోట్లు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాం. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తానని హామి ఇచ్చారని తెలిపారు. అనంతరం నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ… మినీ గురుకులాల ఏర్పాటు అంశం చాలా అవసరం. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఫౌండేషన్ బాగుంటుంది.

మా విజ్ఞప్తులన్నింటికీ స్పందించి కేంద్రం సహాయం చేయాలి. విద్యారంగ అభివృద్ధి విషయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య అందించాలన్నదే సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఉద్యోగాలు రానివారికి మళ్లీ శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఉద్యోగం చిన్నదా, పెద్దదా అన్న విషయం చూడొద్దు. ఏదో ఒక పని చేయడం అలవాటు చేసుకోవాలని యువతకు విజ్ఞప్తి చేశారు.