Home నెల్లూరు కోవూరు JNI Today / వైకాపా ప్రభుత్వం లో నిత్యావసర వస్తువులు ధరలకు ఆదుపేలేదు – చేజర్ల...

JNI Today / వైకాపా ప్రభుత్వం లో నిత్యావసర వస్తువులు ధరలకు ఆదుపేలేదు – చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

0
3

JNI Today కోవూరు : వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలకు ఆదుపేలేదని అదేవిధంగా వాటిని అదుపు చేయవలసిన మంత్రి నోటికి హద్దే లేదని కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు పనులు లేక రాబడి లేక కుటుంబ జీవనం ఎలా సాగాలో తెలియక అయోమయ పరిస్థితులలో ఉన్న సమయములో మూలిగే నక్క పై తాటి కాయ పడినట్లు అడ్డు,అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వలన కుటుంబాలు కుదేలు అవుతున్నవని,ఉప్పు,పప్పు కూడా కొనే పరిస్థితి లేదని,రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగి పోతున్న రాష్ట్ర ప్రభుత్వం లో కనీస స్పందన కూడా లేదని,గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధర పై ప్రతి కుటుంబానికి నెలకు రెండు కిలోల కంది పప్పు ఇవ్వగా ఈ ప్రభుత్వం దానిని కిలోకి తగ్గించారని అదేవిధముగా రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ను నియంత్రించవలిసిన పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీ కొడాలి నాని ఆపని వదిలేసి ప్రతిపక్ష పార్టీల ను తిట్టడమే పని గా పెట్టుకున్నారని అందువలన ప్రభుత్వ నియంత్రణ లేక వ్యాపారులు కుత్రిమ కొరత సృష్టించి సరుకుల ధరలను విపరీతంగా పెంచుతున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లో ఉన్న మార్చి నెలలో ఉన్న ధరల కంటే నేడు ఉన్న వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, గతములో నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడయినా పేరిగితే నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి రేట్లు పెరగడానికి గల కారణాలు తెలుసుకొని అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి సరుకులు దిగుమతి చేసుకుని రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రణ చేసారని, కానీ నేటి ప్రభుత్వం లో వాటి గురుంచి పట్టించుకొనే నాధుడే కరువయ్యారని,ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు శ్రీ ఏలూరు క్రిష్ణయ్య, శ్రీ దారా విజయబాబు,శ్రీ శివుని రమణారెడ్డి, శ్రీ ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి,శ్రీ బుధవరపు శివకుమార్,శ్రీ గొర్రిపాటి నరసింహ,శ్రీ కలువాయి చెన్నకృష్ణా రెడ్డి, శ్రీ ఉయ్యురు వేణు,శ్రీ బత్తుల రమేష్,శ్రీ అగ్గి మురళి, శ్రీ పులా వెంకటేశ్వర్లు, శ్రీ సోమవరపు సుబ్బారెడ్డి శ్రీ గరికిపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.