Home తాజా వార్తలు JNI Today / పబ్లిక్ టాక్ : తెనాలి రామకృష్ణ బీఏబీఎల్

JNI Today / పబ్లిక్ టాక్ : తెనాలి రామకృష్ణ బీఏబీఎల్

0
10

JNI Today : కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయినా దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’. దేశముదురు బ్యూటీ హన్సిక హీరోయిన్ గా నటించగా..తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయ్యప్ప, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సప్తగిరి, రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కాగా ఈ సినిమా ఫై నమ్మకం తో ఓ రోజు ముందే ఈ చిత్ర ప్రీమియర్స్ షోస్ వేయడం జరిగింది. హైదరాబాద్, కర్నూలు, తెనాలి, రాజమండ్రిలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ షోలు చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు.

సినిమా మొత్తం హ్యాపీ గా నవ్వుకుంటూ..అన్ని బాధలు మరచిపోయి చూసే సినిమా అని చెపుతున్నారు. టైటిల్ కార్డు పడిన దగ్గరి నుండి ఎండ్ కార్డు పడేవరకు నవ్వుతూనే ఉంటారని..సందీప్ కిషన్ సినిమా మొత్తం తన భుజాల ఫై వేసుకున్నాడని అంటున్నారు. ఏపీలో పొలిటికల్‌గా బాగా పాపులర్ అయిన కోడికత్తి, గ్రామ వాలంటీర్లు, కేఏ పాల్ కామెడీ వంటి సంఘటనలను సినిమాలో బాగా వాడేసారని..కేఏ పాల్ పాడిన పాట స్టైల్లో నటి సత్య కృష్ణన్ చేసిన కామెడీ సినిమాకే హైలైట్ గా ఉందని చెపుతున్నారు. ఓవరాల్ గా ఈ మధ్య ఎలాంటి కామెడీ ఎంటర్టైనర్ రాలేదని ఫ్యామిలీ అంత ఎంచక్కా చూసే చిత్రమని చెపుతున్నారు.