Home నెల్లూరు గూడూరు JNI Today / రెడ్డిపాలెం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు

JNI Today / రెడ్డిపాలెం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు

0
9

JNI Today : నెల్లూరు జిల్లా, వాకాడు మండలం, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల రెడ్డి పాలెం నందు ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా పాఠశాల నందు ప్రధానోపాధ్యాయురాలు ఆత్మకూరు భారతి ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలలకు నెహ్రూ గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆత్మకూరు భారతి, అంగన్ వాడీ కార్యకర్త కోటమ్మ, పేరెంట్స్ కమిటీ చైర్ పర్సన్ మస్తానమ్మ, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.