JNI Today : ప్రముఖ నటుడు హీరో రాజశేఖర్‌కు పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఓఆర్ఆర్పై సినీ హీరో రాజశేఖర్ కారుకు రోడ్ యాక్సిడెంట్ అయ్యింది. హైవేపై అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ దగ్గర అదుపుతప్పి కారు బోల్తా పడింది. కారులో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి ప్రయాణిస్తున్నాడు. కారు బెలూన్లు తెరుచుకోవండతో ఇద్దరికీ తప్పిన ప్రాణాపాయం. అయితే.. కారు బోల్తా పడటంతో.. రాజశేఖర్‌తో పాటు మరొక వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు.