JNI Today కోల్కత్త: ఇండియా సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో శనివారం జరిగిన మ్యాచ్‌లో రా§్ుకృష్ణ సూపర్ షోతో అథ్లెటికో డి కోల్‌కతా 3-1తో జంషెడ్‌పూర్‌పై గెలిచింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా మళ్లీ టాప్‌లోకి చేరింది. సెకండాఫ్‌లో యువ స్ట్రయికర్ రా§్ుకృష్ణ (57వ, 71వ) రెండు గోల్స్ చేసి కోల్‌కతాను ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత సెర్గో కాస్టెల్ (85వ) జంషెడ్పూర్ తరపున తొలి గోల్ చేశాడు. 91వ నిమిషంలో కోల్‌కతా మిడ్ ఫీల్డర్ గార్సియా మెరుపు గోల్ చేసి 3-1తో తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.