Home ఆంధ్రప్రదేశ్ చిత్తూరు JNI Today / బురద చల్లడమే చంద్రబాబు లక్ష్యం:మంత్రి పెద్దిరెడ్డి

JNI Today / బురద చల్లడమే చంద్రబాబు లక్ష్యం:మంత్రి పెద్దిరెడ్డి

0
6

JNI Today చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మీద బురద చల్లడమే ఆయన లక్ష్యమని విమర్శించారు. తాము రౌడీయిజం చేస్తున్నామని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సలహాలు కూడా ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పినట్లు.. పవన్‌ నడుచుకుంటున్నారని తప్పుబట్టారు. చంద్రబాబు పాలనలో తీవ్ర కరవు వచ్చిందని..వైఎస్‌ జగన్‌ పాలనలో నదులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. త‍్వరలోనే ఇసుక కొరత తీరుతుందని అన్నారు.

మొగలిఘాట్‌ ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకుంటామన్నారు. మొగలిఘాట్ లో ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్షాకాలంలో భవన నిర్మాణాలు ఉండవని, ఇసుక కొరత వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు.