Home నెల్లూరు గూడూరు JNI Today / ఎస్జీటీ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవ పోరాట వేదిక ఆధ్వర్యంలో ఎస్జీటీ...

JNI Today / ఎస్జీటీ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవ పోరాట వేదిక ఆధ్వర్యంలో ఎస్జీటీ ఉపాధ్యాయుల సమావేశం

0
17

JNI TODAY : నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఎన్జీఓ హోమ్ నందుఎస్జీటీ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవ పోరాట వేదిక ఆధ్వర్యంలో ఎస్జీటీ ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్జీటీ ఉపాధ్యాయ సమస్యల గురించి చర్చించారు. 12 సంవత్సరాల స్కేలు తీసుకున్న ఎస్జీటీలను స్కూలు అసిస్టెంట్ లగా గుర్తించి తదుపరి ప్రమోషన్లకు అవకాశం కల్పించాలి. జీఓ 77 రద్దు చేసి అర్హత గల ఎస్జీటీ, పండిట్, పీఈటి లకు అప్గ్రేడ్ పోస్టులలో పదోన్నతులు కల్పించాలి. ప్రతి ప్రాథమిక పాఠశాలలో పి.ఎస్.హెచ్.ఎం. పోస్టులను మంజూరు చేయాలి. పీఆర్సీ లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలి. ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. మూడు సంవత్సరాల సర్వీస్ గల ఎస్జీటీ లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిచాలి. ఈ డిమాండ్ల సాధనకు కృషి చేయాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని ఎస్జీటీ ఆత్మ గౌరవ పోరాట వేదిక నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ జివి.రత్నం, కో-కన్వీనర్ కె.ప్రతాప్, ఆర్గనైజంగ్ సెక్రటరీలు రియాజ్, వీర రాఘవయ్య ఇతర నాయకులు
భాస్కర్ రెడ్డి, భాస్కర్ రాజు, మురళీ మోహన్ వర్మ, రామకృష్ణ, నాగేంద్ర, ప్రసాద్, శివ ప్రసాద్, జనార్ధన్, వెంకట రమణయ్య, రవి, శ్రీనివాసులు, జయరాజ్, గీతాలక్ష్మి, బషిరున్నిసా, అరుణ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.