JNI Today ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏడు కొండలు అనే వ్యక్తి రెండంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అసహజ కోరికలే భర్త ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఏడు కొండలు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా. భార్య ఇంట్లోనే ఉండేది. ఖాళీగా ఉన్న భార్య కళాశాల విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లోబర్చుకునేది. ఆన్లైన్ షాపింగ్ ద్వారా సెక్స్ టాయ్స్ కొనుగోలు చేసి, మగవాడిలా వేషం ధరించి సెస్క్ టాయ్స్‌తో బాలికలతో అసహజ శృంగారం చేస్తుండేదని పోలీసులు తెలిపారు. దీనిని భరించలేక జరుగుమిల్లిలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఓ బాలిక ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో ఏడుకొండలు ఇంటికి వెళ్లి పోలీసులు తనిఖీలు చేశారు. ఇంట్లోని ఓ సంచిలో వారికి పలురకాల సెక్స్‌టాయ్స్ కనిపించాయి. దీంతో అవమాన భారం భరించలేక భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.