JNI Today తూర్పు గోదావరి : కాకినాడ రూరల్ సూర్యరావుపేట లైట్ హౌస్ సమీపంలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటనా స్థలానికి అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి. మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది యత్నిస్తోంది. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి మంత్రి కన్నబాబు వచ్చారు. బాధితులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.