Home నెల్లూరు కోవూరు JNI Today /  నాలుగు లక్షల ఉద్యోగాల ఘనత సీఎం జగన్ దే – ఎంపీ...

JNI Today /  నాలుగు లక్షల ఉద్యోగాల ఘనత సీఎం జగన్ దే – ఎంపీ ఆదాల

0
2

JNI Today కోవూరు : రాష్ట్రంలో ఒకే సారి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి దేనని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. కొడవలూరు మండలం లోని విద్యుత్ సబ్ స్టేషన్ను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి లతో కలిసి బుధవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ స్థానికంగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దే నని ఆదాల ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. గత ఐదేళ్లలో చంద్రబాబు పాలన తీరు చూసి వైసీపీకి పట్టం కట్టారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు ఏమాత్రం తీసిపోకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు అప్పుల్లో ఉన్న రాష్ట్రం నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకొని బయట కు తీసుకు వస్తున్నారని చెప్పారు .మధ్యలో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారని తెలిపారు. జగన్మోహన్రెడ్డి వచ్చిన వేళా విశేషంతో వానలు కురిసి జలాశయాలు నిండా అని రెండో పంట పండించుకునే అవకాశం కూడా జిల్లావాసులకు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గతంలో మొదటి పంట కే నీళ్లు లేక పంటలు సరిగా పండలేదు అని, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలిపారు. జిల్లాలోని చెరువులు కూడా నీటి తో కళకళలాడుతున్నాయని కండలేరుకు కూడా ఇంకా నీళ్లు వస్తాయని జిల్లా సస్యశ్యామలం అవుతుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ,రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు ఝాన్సీలక్ష్మి, నరసింహ రావు, చలపతి, పాముల హరి, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు కొత్త వంగల్లు లోని అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

JNI Today