Home ఆంధ్రప్రదేశ్ కడప JNI Today / కువైట్ నుంచి వచ్చిన కొన్ని గంటలకే కడపలో ఘోరం!

JNI Today / కువైట్ నుంచి వచ్చిన కొన్ని గంటలకే కడపలో ఘోరం!

0
5

JNI Today కడప: కువైట్ నుంచి వచ్చిన కొన్ని గంటలకే ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం రెడ్డిపల్లి చెరువు కట్టమీద సోమవారం ఉదయం ట్రక్, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నందలూరు మండలం నీలిపల్లికి చెందిన మనెమ్మ, సాయికిరణ్ (కుమారుడు), పవన్ కళ్యాణ్ (డ్రైవర్) అనే ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… మన్నెమ్మ కువైట్ నుంచి ఇండియాకు వస్తుండటంతో ఆమె కుమారుడు సాయి కిరణ్ వారికి సొంత వాహనాలు ఉన్నా.. డ్రైవర్ లేకపోవడంతో అద్దె వాహనంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు.

తల్లితో కలిసి కడపకు వస్తుండగా ఓబులవారిపల్లె మండలం రెడ్డిపల్లి చెరువుకట్టపై కారు.. ట్రక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన అనంతరం ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఓబులవారిపల్లి ఎస్సై నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.