Home తాజా వార్తలు JNI Today / మళ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా

JNI Today / మళ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా

0
28

JNI Today రాంచి: భారత్‌ X దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరి పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో రాంచి వేదికగా మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కెప్టెన్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ఈ టెస్టులోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలనే ఆలోచనతో బరిలోకి దిగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా కనిపిస్తోంది. కాగా టీమిండియా చైనామన్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ గాయం కారణంగా అతడికి బదులు నదీమ్‌ను ఈ మ్యాచ్‌లో ఆడిస్తున్నారు. అతడికి ఇదే తొలి టెస్టు కావడం విశేషం.