JNI Today పుణె టెస్ట్: పుణె వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. నిన్నటి స్కోరు 36/3 తో ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా కొద్దిసేపటికే నాలుగో వికెట్ను కోల్పోయింది. 28 బంతులు ఆడిన అనైచ్ నోర్జే 3 పరుగులు చేసి వెనుదిరిగాడు. షమీ బౌలింగ్లో అనైచ్ నోర్జే విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. డీ బ్రూయెన్ (24), డూ ప్లెస్సిస్ (4) క్రీజులో ఉన్నారు.