Home తాజా వార్తలు JNI Today / గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌-ఉపాధ్యాయులపై సస్పెండ్‌ వేటు

JNI Today / గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌-ఉపాధ్యాయులపై సస్పెండ్‌ వేటు

0
21

JNI Today శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలోని ప్రిన్సిపల్‌ పై, ఉపాధ్యాయులపై సస్పెండ్‌ వేటు పడింది. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకి పెడుతున్న భోజనాలు బాగోకపోవడం, మెనూ పాటించకపోవడం పై జిల్లా కలెక్టర్‌ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. పాఠశాల ప్రిన్సిపల్‌ బాలాజి నాయక్‌ ను సస్పెండ్‌ చేశారు. తనిఖీ సమయంలో విధి నిర్వహణలో ఉండి కూడా స్కూల్‌లో లేని మరో అయిదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు.