Home తాజా వార్తలు JNI Today / జనవరిలో అటవీ శాఖ పోస్టుల భర్తీ

JNI Today / జనవరిలో అటవీ శాఖ పోస్టుల భర్తీ

0
9

JNI Today వెంకటగిరి : రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్నపోస్టులను వచ్చే ఏడాది జనవరిలో భర్తీ చేస్తున్నట్లు పీసీసీ ఎఫ్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయాన్ని ఆదివారంఅయన సందర్శించారు. ఈ సందర్భంగా పీసీసీఎఫ్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అటవీ శాఖలో 50 శాతం ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరామన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించారన్నారు.. ప్రధానంగా ఎర్రచందనం
అక్రమ రవాణాపై గట్టిగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అటవీ శాఖలో అవినీతి రహిత పాలన అందించేలా గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. లంచం ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరమని బోర్డు తమ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఒక్క మొక్క నాటితే ఏడాదికి 5 కోట్ల మొక్కలు పెంచవచ్చన్నారు. ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించి సహకరిస్తే లక్ష్యం సాధించవచ్చన్నారు. అనంతరం స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో గుంటూరు కన్జర్వేటర్ శ్రీనివాస శాస్త్రి , డీఎఫ్ శీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు .