Home తాజా వార్తలు JNI Today / విరువూరు గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన కాకాణి

JNI Today / విరువూరు గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన కాకాణి

0
11

JNI Today : నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం, విరువూరు గ్రామంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి.గ్రామ సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు, లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పెన్షన్లు పంపిణీ చేసారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ, గాంధీజీ పుట్టిన రోజున గ్రామ సచివాలయాలను ప్రారంభించిందన్నారు.
పంచాయితీ వ్యవస్థ సర్పంచులకు అధికారం లేక, సరైన సిబ్బంది లేక నానాటికీ దిగజారి పోయిందని,
గ్రామంలోని ప్రజల అవసరాలను, గ్రామ పొలిమేర దాటకుండానే పరిష్కరించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గ్రామాలలోని సమస్యలు పరిష్కరించే దిశగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో, గ్రామాలలో మంచి పాలనను అందించే దిశగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుందన్నారు.

గ్రామ స్వరాజ్య సాధనకు గ్రామ ప్రగతే – దేశానికి పట్టుకొమ్మలుగా నిలుస్తుందన్న బాపూజీ భావనకు అద్దం పడుతూ ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారని, గ్రామానికి 12 ఉద్యోగాలు ఇచ్చి, మీ అవసరాలను మీ గ్రామంలోనే తీర్చే విధంగా సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారన్నారు.

మా కుటుంబానికీ, స్థానిక సంస్థలకు మధ్య ఉన్న అనుబంధం ఆంధ్రరాష్ట్రంలో ఇంకెవరికీ ఉండదన్నది నా అభిప్రాయం. నా తల్లి లక్ష్మీకాంతమ్మ గారు 25 సంవత్సరాలు తోడేరు గ్రామ సర్పంచ్ గా, మా తండ్రి గారు 18 సంవత్సరాలు పొదలకూరు సమితి అధ్యక్షులుగా, నేను జిల్లా పరిషత్ అధ్యక్షునిగా పని చేశాం.
ఒకే కుటుంబం నుండి గ్రామ స్థాయి, సమితి స్థాయి, జిల్లా స్థాయిలో సేవలందించేందుకు మా కుటుంబాన్ని ఆదరించిన పొదలకూరు ప్రజానీకానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.