JNI Today పొదలకూరు : నెల్లూరు జిల్లా,పొదలకూరు మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమములోవై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించబడుతున్నాయన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడటంతో, విశేషంగా పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారని అన్నారు. చాలా సంవత్సరాల నుండి పరిష్కారం కాని సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు రైతులకు రైతు భరోసా పధకం ద్వారా రూ.12,500/- లు పెట్టుబడి సహాయం అందిస్తున్నారన్నారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల రికార్డులను సరిచేసి, ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందే విధంగా చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులను కోరామని, బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధనకు గ్రామ సచివాలయాలను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారన్నారు.
Home తాజా వార్తలు JNI Today / గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి – కాకాణి గోవర్ధన్...