JNI Today శ్రీకాకుళం : గొట్టా బ్యారేజీకి వరద నీరు పెరుగుతోంది. గురువారం గొట్టా బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చే సూచనలు ఉండటంతో, సాయంత్రానికి 40వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కానుందని అధికారులు అంచనా వేశారు. మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా వరద వస్తున్న నేపథ్యంలో.. శ్రీకాకుళంంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గొట్టా బ్యారేజీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.