Home నెల్లూరు JNI Today / రికార్డు స్థాయిలో జాతర ఆదాయం

JNI Today / రికార్డు స్థాయిలో జాతర ఆదాయం

0
11

JNI Today వెంకటగిరి(నెల్లూరు) : గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో జాతర ఆదాయం పెరిగింది. జాతర రోజు వర్షం కురిసినా అమ్మదర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తుల తాకిడి మాత్రం తగ్గలేదు. శక్తిస్వరూపిణి పోలేరమ్మ జాతర హుండీ ఆదాయం వివరాలను ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి శుక్రవారం వివరించారు. అంతకుముందు దేవదాయశాఖ కార్యాలయం ఆవరణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జాతరలో ప్రత్యేక దర్శనం టికెట్‌ రూ.100 ద్వారా రూ.5,13,700 రాగా గతేడాది జాతరలో రూ.5,02,700 వచ్చింది.

ఆభరణాలు కూడా..
వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతరలో డొనేషన్లు, టికెట్‌ల ద్వారానే కాకుండా అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను సైతం భక్తులు గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో సమర్పించుకున్నారు. బంగారం గతేడాది 14.600 గ్రాములు రాగా ఈ ఏడాది 56.580 గ్రాములు భక్తులు సమర్పించారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 41.980 గ్రాముల బంగారం పెరిగింది. ఇక వెండి ఈ ఏడాది 1,896 కేజీలు రాగా గతేడాది 0.131 గ్రాములు మాత్రమే వచ్చింది. గతేడాది కంటే 1.765 కేజీల వెండి ఆభరణాలు అమ్మవారికి అధికంగా సమకూరినట్లు ఈఓ వివరించారు.