Home తాజా వార్తలు JNI Today / వరదల పై అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు

JNI Today / వరదల పై అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు

0
1

JNI Today శ్రీకాకుళం : వంశధార, నాగావళి నదుల వరదల పై సంబంధిత జిల్లా, మండల అధికారులతో జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ ను నిర్వహించారు. జె.నివాస్‌ మాట్లాడుతూ… అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం నాటికి వంశధారలో 1.50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుకుంటుందని తెలిపారు. విఆర్వో లు గ్రామాల్లో ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు, నదులను దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు.అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. వంశధార, నాగావళి అధికారులు ఒడిశా అధికారులతో నిత్యం సంప్రదింపులు చేసి పరిస్థితిని తెలియజేస్తుండాలని చెప్పారు. రవాణా చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఒక ఎస్‌డిఆర్‌ఎఫ్‌ టీం ను హిరమండలం లో సిద్ధం చేశామని, ఎక్కడ అవసరమైతే అక్కడ వినియోగించాలని తెలిపారు. వరద ప్రభావం ఉండే అన్ని గ్రామాలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు.