Home తాజా వార్తలు JNI Today / చిక్కుడు గింజల మసాలా

JNI Today / చిక్కుడు గింజల మసాలా

0
12

JNI Today : కావలసినవి : గింజలు: 2 కప్పులు, ఉల్లిపాయ: ఒకటి (పెద్దది), టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, లవంగాలు: రెండు, దాల్చినచెక్క: అర అంగుళంముక్క, అల్లంవెల్లుల్లి: టీస్పూను, కసూరి మెంతి: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: పావుటీస్పూను, పసుపు: చిటికెడు, దనియాలపొడి: టీస్పూను, పెరుగు: టేబుల్‌స్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం : గింజల్ని ఉడికించి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు వేయాలి. తరవాత పసుపు, ఉల్లిముక్కలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి మూతపెట్టి ఉడికించాలి. తరవాత గరిటెతో టొమాటోల్ని మెత్తగా మెదిపి దనియాలపొడి, కసూరిమెంతి వేసి కలపాలి. తరవాత పెరుగు వేసి కలిపి ఉడికించిన చిక్కుడు గింజలు వేసి పావుకప్పు నీళ్లు పోసి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించి దించాలి.