Home ఆంధ్రప్రదేశ్ JNI Today / అబద్ధం, మోసం రాజ్యమేలుతున్నాయ్‌

JNI Today / అబద్ధం, మోసం రాజ్యమేలుతున్నాయ్‌

0
22

– వైసిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్‌.విజయమ్మ విమర్శ 

JNI ప్రకాశం : రాష్ట్రంలో అబద్ధం, మోసం రాజ్యమేలుతున్నాయని వైసిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్‌.విజయమ్మ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం యర్రగొండపాలెంలో వైఎస్‌ సెంటర్‌లో జరిగిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు 650 వాగ్దానాలు చేశారని, ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ప్రకాశం జిల్లాకు 16 సార్లు వచ్చిన చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టును 16 ఇంచులు కూడా పూర్తి చేయలేదని చెప్పారు. టిడిపి పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, అది వైఎస్‌ హయాంలోనే రూపుదిద్దుకుందని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో రూ.370 కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులను మోసం చేసిందన్నారు. న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న ఈ యుద్ధంలో వైసిపికు ఓట్లు వేసి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు కాలేదన్నారు. వైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నారు.