Home ఆంధ్రప్రదేశ్ JNI Today / అసెంబ్లీకి వెళ్లని వారికి ఎమ్మెల్యే పదవులెందుకు…? – అబ్దుల్ అజీజ్

JNI Today / అసెంబ్లీకి వెళ్లని వారికి ఎమ్మెల్యే పదవులెందుకు…? – అబ్దుల్ అజీజ్

0
74

JNI Today : ప్రజాసమస్యలపై అసెంబ్లీలో గళం విప్పి పరిష్కారానికి పాటుపడాల్సిన వైసిపి ఎమ్మెల్యేలు రెండున్నర ఏళ్లుగా గోతుల్లో దాక్కుని, ఎన్నికల ప్రచారాల్లో మాత్రం అమాయకపు మొహాలతో కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, అలాంటి వారిని శాశ్వతంగా ఇంటికే పరిమితం చేయాలని నగర మేయర్, రూరల్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రూరల్ నియోజకవర్గంలోని గొల్ల కందుకూరు, సజ్జాపురం, పాత వెల్లంటి, కొత్త వెల్లంటి, కందమూరు, ఉప్పుటూరు ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం పర్యటించారు. స్థానిక వీధుల్లో పర్యటిస్తూ రాష్టాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా చేపట్టిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించి, తెలుగుదేశం ప్రభుత్వాన్నే మళ్లీ తీసుకురావాలని కోరారు. విస్తృత ప్రచారంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలుగుదేశం పార్టీపై అభిమానం చూపుతూ నాయకులపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పునాదులు అత్యంత పటిష్టంగా ఉన్నాయని, ఎన్నో ఏళ్లుగా సైకిల్ గుర్తుకు ఓటేసేందుకు అభిమానులంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారని హర్షం వ్యక్తం చేసారు. పొరపాటున వైసిపి పాలన వస్తే, ప్రశాంతంగా ఉండే నెల్లూరులో ఫాక్షన్ గొడవలు, రౌడీయిజం, దౌర్జన్యాలు, ఆక్రమణలు, అత్యాచారాలు పెరిగిపోయి ప్రజలకు కంటిమీద కునుకు ఉండదని ఆయన హెచ్చరించారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలు గతంలో ఎన్నడూ లేనంత సమగ్రమైన అభివృద్ధిని సాధించి టిడిపి పనితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయని అజీజ్ సంతోషం వ్యక్తం చేసారు.

రూరల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా జరిగిన అభివృద్ధి పనులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు, మంత్రి నారాయణ సహకారం, మేయర్ గా తాను తీసుకున్న కీలక నిర్ణయాలు, తెలుగుదేశం ప్రభుత్వ పాలన వంటి అంశాలతోనే సాధ్యమయ్యాయని, అభివృద్ధి పనులు నిర్విరామంగా కొనసాగుతూ, ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులందరికీ పారదర్శకంగా అందాలంటే చంద్రబాబునే మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని ప్రజలకు ఆయన వివరించారు. తొలిసారి పార్లమెంట్ అభ్యర్థిగా బిసి నాయకులు బీదా మస్తాన్ రావుకు అవకాశం లభించిందని, అఖండ మెజారిటీతో గెలిపించుకుని బిసిల సత్తా చాటుదామని అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సతీమణి జ్యోతి, నాయకులు వేమిరెడ్డి కౌసల్యమ్మ, వేమిరెడ్డి అశోక్ రెడ్డి, పులి రాంగోపాల్, బోగోలు సుధాకర్ రెడ్డి, పోనక హరిబాబు రెడ్డి, యరగల కృష్ణయ్య, యరగల శీనయ్య, రాపూరు రత్నం, పాదర్తి నరసయ్య, వజ్జం సీతారామి రెడ్డి, గణపాల వెంకట రమణారెడ్డి, మహేష్ నాయుడు, రాపూరు పెంచలయ్య, రాపూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.