Home తాజా వార్తలు JNI Today / అంతు బట్టని వ్యాధితో అల్లాడుతున్న చిన్నారి

JNI Today / అంతు బట్టని వ్యాధితో అల్లాడుతున్న చిన్నారి

0
1021

JNI Today పొదలకూరు: పొదలకూరు పట్టణంలోని సంగంరోడ్డు సమీపంలో కొత్తగా వేసిన లేఔట్లొ షాహిన, అహమద్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఎనిమిదేళ్ల చిన్నారి అర్షియ ఉంది . ఈ పాపకు గత మూడు నెలల నుంచి అంతుబట్టని వ్యాధి పట్టుకుంది. శరీరమంతటా తెల్లని జిగురు వంటి పదార్థం కారుతోంది.ఈ జిగురు పదార్థాన్ని తుడిచిన కొద్దిసేపటికే మళ్లీ అదే ప్రాంతంలో ఈ పదార్థం వస్తోంది.ఈ రోగాన్ని తగ్గించేందుకు పాప తల్లిదండ్రులు తిరగని వైద్యశాల లేదు. చూపని డాక్టర్ లేడు. అయినా ఎవరూ ఎందుకిలా జరుగుతుందో చెప్పలేకపోయారు. అలాగే ఈ జబ్బును అరికట్టలేకపోయారు. చెన్నైలో ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్న పాప తండ్రి అహ్మద్ పాప చికిత్స కోసం ఉద్యోగాన్ని వదిలి వచ్చేశాడు. పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. పాప వైద్యం కోసం తాను దాచిపెట్టుకున్న మూడు లక్షల రూపాయలను ఖర్చు చేసేసాడు. అయినా పాప ఆరోగ్యం మెరుగు కాలేదు. గత 20 రోజుల్లో పాప 3 కిలోల బరువు తగ్గిపోయింది .పాప కోసం ఓవైపు ఉద్యోగాన్ని వదులుకొని, ఉన్నదంతా ఖర్చు చేసిన అహమద్ పాప ఆరోగ్య0 రోజురోజుకు దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు .దయ గల దాతలు స్పందించి తమ పాప అనారోగ్యాన్ని దూరం చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పాప తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.