Home తాజా వార్తలు JNI Today / రత్తాలు ‘బిఎఫ్’ వైరల్..

JNI Today / రత్తాలు ‘బిఎఫ్’ వైరల్..

0
2004

JNI Today అప్పుడెప్పుడో కాంచనమాల కేబుల్ టీవీ చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన లక్ష్మి రాయ్..అప్పటికి సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ అప్పుడు రాణి గుర్తింపు..ఖైదీ నెం 150 ఐటెం సాంగ్ తో వచ్చింది. మెగా స్టార్ చిరంజీవి పక్కన రత్తాలు రత్తాలు అంటూ అదిరిపోయే సెట్స్ వేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా దెబ్బ కు అమ్మడికి బాలీవుడ్ ఛాన్స్ వచ్చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకుని బోల్డ్ గా నటించిన బాలీవుడ్ మూవీ జూలీ సీక్వెల్ డిజాస్టర్ అవ్వడం తో షాక్ లో పడి తెరపై కనిపించడం తగ్గించేసింది.ప్రస్తుతం వేరీజ్ మహాలక్ష్మి సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటె తాజాగా అమ్మడికి బాయ్ ఫ్రెండ్ దొరికినట్లే అనే వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. వేరీజ్ మహాలక్ష్మి షూటింగ్ సమయంలో లక్ష్మి తో ఓ వ్యక్తి ఎప్పుడు ఉండేవాడట..మొదట ఎవరో ఆమె బంధువు కావొచ్చు అని అంత అనుకున్నారట..కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం చూసి ఆమె బాయ్ ఫ్రెండ్ కావొచ్చు అని మాట్లాడుకోవడం మొదలు పెట్టారట. ప్రస్తుతం అయితే ఈ వార్త గట్టిగానే వినిపిస్తుంది. మరి ఈ వార్తల ఫై లక్ష్మి రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.