Home ఆంధ్రప్రదేశ్ JNI Today / ‘తెలియక సమంత అలా కామెంట్‌ చేశారు’

JNI Today / ‘తెలియక సమంత అలా కామెంట్‌ చేశారు’

0
19

JNI Today హైదరాబాద్: తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో త్రిష, విజయ్‌ సేతుపతి జంటగా నటించారు. తెలుగులో యువ కథానాయకుడు శర్వానంద్‌, సమంత నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే గతంలో ‘96’ సినిమా రీమేక్‌ గురించి సమంత మాట్లాడుతూ.. ఇలాంటి అద్భుతమైన సినిమాను రీమేక్‌ చేయకపోవడమే మంచిదని అన్నారు.

అలాంటిది ఈ సినిమా రీమేక్‌లో సమంతే నటించబోతున్నారు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో దిల్‌రాజు స్పందించారు. రీమేక్‌లో ఎవరెవరు నటిస్తున్నారో, ఎవరు నిర్మిస్తున్నారో తెలియక సమంత అలా కామెంట్‌ చేసేశారని దిల్‌రాజు తెలిపారు. తెలిసుంటే ఆ మాట అనేవారు కాదని పేర్కొన్నారు. ‘96’ తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన ప్రేమ్‌ కుమార్ రీమేక్‌ చిత్రానికీ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.