చరిత్ర మారదు – మోపూరు పెంచల నరసింహం
ఎన్ని చట్టాలు కుమ్మరించినా
ఎన్ని శిక్షల శిలా శాసనాలు వ్రాసినా
ఎన్ని కన్నీటి జలపాతాలు పొంగినా
ఎందరు నియంతలు
బూడిద కుప్పలుగా మారినా
ఎన్ని రాతిగుండెలను
యావజ్జీవ కారాగారంలో కి నెట్టి నా
ఆబుల్లెట్ ఆగదు
ఆరక్తం ఇంకదు
ఆచరిత్ర మారదు