Home సాహిత్యం JNI TODAY / స్పర్శ -దువ్వూరు సుమలత

JNI TODAY / స్పర్శ -దువ్వూరు సుమలత

0
146

స్పర్శ – దువ్వూరు సుమలత

అమ్మ నిజం నాన్న నమ్మకం

నమ్మకముంటేనే ఏదైనా సాధించగలం

అది ప్రియురాలి ప్రేమైన సివిల్స్ రాంకైనా

నాన్నది బయటపడని ప్రేమ

కొడుకు చదువుకు

స్వేదాన్ని చిందిస్తూ బతుకు పోరులో….

అలుపెరుగని యుద్ధం చేస్తుంటాడు

కూతురి లాగ్గానికి

తన రక్తపు చుక్కల్ని లెక్కచెయ్యక

ఖర్చుచేసే తండ్రులందరో….

నువ్వు నాన్నైతే గాని

నీ తండ్రి పడ్డ కష్టం గుర్తు రాదు

నీ విజయాలకు

తాను రొమ్ము విరుచుకుని నిలబడతాడు

నా రక్తమేనంటూ మురిసిపోతాడు

అలాంటి నాన్నకి

మనం ఓదార్పు చేయూత కాలేమా

కొంతసమయం

నీ స్పర్శ నాన్నకు తగులుతూ కూర్చొంటే

ఆ మనసుకెంతో స్వాంతన

మనకిది సాధ్యమే చేద్దామా ….