Home సాహిత్యం JNI TODAY : స్వాతి చినుకులు – జంజం కోదండ రామయ్య

JNI TODAY : స్వాతి చినుకులు – జంజం కోదండ రామయ్య

0
284

స్వాతి చినుకులు – జంజం కోదండ రామయ్య

ప్రశాంతతకు ఆనవాళ్ళు
మన గోపురాలు గుళ్ళు
అది తెలిసే కాబోలు
వాటిపై నివసిస్తుంటాయి పావురాళ్ళు
పక్షుల లో వుంది ఎంతో క్రమశిక్షణ
అసలు మనకుందా విచక్షణ
అందుకే వాటిదగ్గర పొందాలి శిక్షణ
వాటికి కలిగించాలి తగు రక్షణ
అదే వాటికి మనమిచ్చే గురు దక్షిణ
ఒక పక్షికి అన్యాయం జరిగితే
ప్రతిఘటిస్తాయి వేల వేల పక్షులు
సాటి మనిషికి అన్యాయం జరిగితే
తప్పుకుంటారు ప్రత్యక్ష సాక్షులు
పక్షుల నైనాచూచి నేర్చుకో అయిఖ్యము
మనషులందరితో కలిగించుకోలౌఖ్యము
అదే మనకు ముఖ్య ము