Home సాహిత్యం JNI TODAY / పిచ్చి పావురాళ్ళు – మోపూరు పెంచల నరసింహం

JNI TODAY / పిచ్చి పావురాళ్ళు – మోపూరు పెంచల నరసింహం

0
115

పిచ్చి పావురాళ్ళు – మోపూరు పెంచల నరసింహం

ఇక్కడ అక్కడ
మైకులు మౌనవృతం చేస్తున్నాయి
వాళ్ళూ వీళ్ళూ విసిరిన
వాగ్దానాల భాణాలు
కంటికి కనిపించకుండా
వేగంగా తిరుగుతున్నాయి
ఆశలగింజలను
విసిరిన ఆఘరసనా వేటగాళ్ళు
ఏ పిట్టలు తమబుట్టల్లో
పడతాయోనని
బ్యాలెట్ పెట్టెల వెనుక
నక్కి చూస్తున్నారు
అనాధిగా ఆశలగింజలకోసం వాలి
వరాల వలల్లో చిక్కుకుని
అయిదేళ్ళ పాటు బంధీలుగా వుండిపోతాయి
పాపం పిచ్చి పావురాళ్ళు

– మోపూరు పెంచల నరసింహం