Home నెల్లూరు *నోటా* ఓటు – రచన..డా.ఈదూరు సుధాకర్

*నోటా* ఓటు – రచన..డా.ఈదూరు సుధాకర్

0
61

*నోటా* ఓటు – రచన..డా.ఈదూరు సుధాకర్

*నోటా* ఓటు

మీ ఇంట్లో చాకుంది బాకుంది
మాఇంట్లో ఓటుంది…

మీ ఇంట్లో కత్తుంది గొడవలుంది
మాఇంట్లో ఓటుంది…

మీఇంట్లోబరెసుందిబాణముంది
మాఇంట్లో ఓటుంది…

కత్తులు గొడ్డళ్ళకి
బాకులు చాకలకి
బరిశెలు బాణాలకి
ఐదొందలనోట్లకి
బీరు బిర్యానీలకి
కాలం చెల్లిందోయ్
జంపు జిలానీ…

మన రాష్ట్ర జనాభా ఐదుకోట్లు
మన రాష్ట్ర బడ్జెట్టు లక్షకోట్లు
ఏమయ్యాయని
ఎక్కడికి పోయాయని
ప్రశ్నిస్తున్నాయి…మాఓట్లు

ఎవడూ లేకపోతే
అక్కమొగుడే దిక్కంటుంది
నీ…ఓటు
ఎవడూ నచ్చకపోతే
నేనుండానంటుంది
జనం చేతిలో నోటా ఓటు

పాస్ట్ ఈజ్ పాస్ట్
ఇప్పుడు….
మా మాటే బ్రహ్మాస్ర్తరం
మా ఓటే వజ్రాయుధం.
————–*———–