Home నెల్లూరు JNI TODAY / ‘ఘంటారావం’ – రచన అవ్వారు శ్రీధర్ బాబు.

JNI TODAY / ‘ఘంటారావం’ – రచన అవ్వారు శ్రీధర్ బాబు.

0
69
ఘంటారావం’ – రచన అవ్వారు శ్రీధర్ బాబు

ఘంటారావం

ఎగురుతుంది మనసు విమానం …ఆశల ఆకాశంలో
ప్రయాణం కు తీరం లేదు

రాబందు చూపులెపుడు రాసుల కుప్పల వైపే…..

దురాశ గాలి ఉదృతి కి తరుల పేగులు మెలి తిప్పిన బాధ
ఎర్రని కన్నీరైంది ప్రత్యూషం

ఎన్నో సూట్లు బూట్లు కల్సి చేసిన నేరం…!
మా ఇల్లు భగభగ మండుతున్న వేడి……!

పరాయి మనసులు పాలిస్తూన్నట్లు….
అవహమై అమాయకులను కబలిస్తున్నట్లు….!

కొమ్మలు వీచే సంగీతం శృతి తప్పిన పాటైంది

వాన చినుకు భువి అందాన్ని పెంచేవేల….గుండె లొ తడి సందడి…! అమ్మ చేతి ముద్ద….

అన్ని…సెజ్ లో కొట్టుకు పోయిన ఊరు జ్ఞాపకాలు
కాలే కడుపు నదుముతూ ఓ చేయి…
ఆస్తినంతా మోసే చేయుంకొకటి
ఎంతెంత దూరం…అనే పిల్లల ఆటలు కావుగా ..బతుకు పోరాటాలు…
కొన్ని వేల ఆక్రందనలు ……! మౌన ఘోష … ఘంటారావమెపుడయ్యేది..!

ఇక తప్పదు …మళ్లీ అందరూ కళ్ళను నేల మీద పరవాలి …!
మానవత్వపు జల్లు అవనిని అభిషేకం చేయాలి …!
———-