JNI Today ఉదయగిరి, దుత్తలూరు, నెల్లూరు(విద్య) : విద్యార్థుల్లో తెలివితేటలను వెలికితీసేందుకు ప్రతిభా పరీక్షలు ఎంతగానో దోహదపడతాయి. ప్రతిభా పరీక్షలతో విద్యార్థుల్లోని సామర్థ్యాలు, మేధాశక్తి కూడా బయటపడుతుంది. ప్రతిభను వెలికితీసేందుకు పలు రకాల పరీక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా నిర్వహిస్తున్నాయి.వాటిని విద్యార్థులచేత దరఖాస్తు చేసుకునేందుకు సహకరించాల్సిన ఉపాధ్యాయులు వెనుకంజ వేస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు పలు రకాల ప్రతిభ ఉపకార (మొదటిపేజీ తరువాయి) వేతనాలకు దూరం అవుతున్నారు. ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించిన ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్ ప్రతిభా ఉపకార వేతనాల కోసం జిల్లాలో చాలా తక్కువ మంది విద్యార్థులే దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఏటా ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్, పదవ తరగతి విద్యార్థులకు ఎన్టీఎస్ ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు దాదాపుగా రెండు నెలల సమయం ఇస్తారు. ఈ పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతిభ ఉపకార వేతనాలు అందిస్తారు. ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన పథకానికి జిల్లాలో అంతంతమాత్రంగానే స్పందన ఉంది. జాతీయస్థాయిలో విద్యార్థులు ప్రతిభ ఏమిటో పరీక్షించాల్సిన చాలా మంది ప్రధానోపాధ్యాయులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో దరఖాస్తులు చాలా తక్కువగా వస్తున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ సామర్థ్యాలను వెలికి తీసేందుకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్), నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్స్(ఎన్టీఎస్) ప్రతిభ పరీక్షలు ఎంతగానో దోహదపడతాయి.