Home తాజా వార్తలు JNI TODAY / అసాధ్యాన్ని సుసాధ్యం చేసేశక్తి యువతదే

JNI TODAY / అసాధ్యాన్ని సుసాధ్యం చేసేశక్తి యువతదే

0
27

JNI Today నెల్లూరు(సాంస్కృతికం) : యువజన సర్వీసుల శాఖ- సెట్నల్‌ ఆధ్వర్యంలో గురువారం టౌన్‌హాల్‌లో జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలను ప్రారంభించిన యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి సి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యువత వివేకానందుని మార్గదర్శిగా తీసుకుని అన్నిరంగాల్లో ప్రతిభను చాటుకోవాలన్నారు. చదువులతో పాటు కళల్లో అభిరుచిని పెంపొందించుకోవడం ద్వారా మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తుందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యంచేసే శక్తి యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజేశ్వరి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జిల్లా సమన్వయకర్త ఖయ్యూం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన 18 రకాల పోటీల్లో యువతీ యువకులు తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. నత్యాలు, గీతాలాపనలు, వివిధ వాద్య పరికారాలను పలికించటంలో ప్రతిభను ప్రదర్శించి అలరించారు. పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి హాజరైన యువతీ యువకులతో టౌన్‌హాల్‌లో సందడి వాతావరణం నెలకొంది. పోటీలకు వ్యాఖ్యాతగా ఉమాకిరణ్‌, న్యాయనిర్ణేతలుగా మద్దెల సాయిబాబా, మురళీమోహన్‌రాజు వ్యవహరించారు. శ్రీరామకృష్ణసేవా సమితి జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన సాయికుమార్‌రెడ్డి, ఆదిత్య కళాశాలల కరస్పాండెంట్‌ ఆచార్య ఆదిత్య, మెజీషియన్‌ రాంజీ, స్వచ్ఛంద సంస్థల జిల్లా అధ్యక్షుడు ఈవీఎస్‌ నాయుడు పాల్గొన్నారు.